![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1071 లో..... శృతి కోసం రాజు, ఇందు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గరికి రేఖ వచ్చి హర్ష గారు వెయిట్ చేస్తున్నారు. ఆ శృతి రాదు మీరు లోపలికి రండి అని రేఖ చెప్తుంది. అప్పుడే శృతి డిజైన్స్ పట్టుకొని ఎంట్రీ ఇస్తుంది. శృతి రావడంతో రేఖ షాక్ అవుతుంది. అసలు అక్కడ ఇంట్లో ఉంది శృతి కాదా.. ఆ రౌడీలు అక్కడ ఏం చేస్తున్నారని రేఖ మనసులో అనుకుంటుంది. రేఖ దగ్గరికి రాజు వచ్చి రౌడీలకి కాల్ చేసి కనుక్కోండి అని చెప్పి వెళ్తాడు. దాంతో రౌడీలకి రేఖ ఫోన్ చేస్తుంది.
ఎక్కడున్నారని రౌడీలని రేఖ అడుగుతుంది. శృతి వాళ్ళ ఇంటి ముందు ఉన్నామని రౌడీలు చెప్తారు. మీకు పని అప్పగించడం నా తప్పు.. శృతి ఆల్రెడీ ఆఫీస్ కి వచ్చిందిరా అని రేఖ వాళ్ళపై కోప్పడి ఫోన్ కట్ చేస్తుంది. మరి ఇంట్లో ఉన్నది ఎవరని రౌడీలు అనుకుంటారు. అప్పుడే నిమ్మకాయ రసం తీసుకొని లేడి గెటప్ లో లక్కీ వస్తాడు. మరొకవైపు డిజైన్స్ చూసిన మేనేజర్ హర్ష ఇక్కడ స్టోన్ ఎందుకు లేదని అడుగుతాడు. ఇదే మంచి ఛాన్స్ కాంట్రాక్టు క్యాన్సిల్ అయ్యేలా చెయ్యాలని రేఖ అనుకొని.. ఏంటి ఇందు ఇలా చేసావ్.. ఇప్పుడు ఆయన కాంట్రాక్టు క్యాన్సిల్ చేస్తే పరిస్థితి ఏంటని అడుగుతుంది. స్టోన్ ఎందుకు పెట్టలేదని ఇందు స్పష్టంగా వివరిస్తుంటే మేనేజర్ హర్ష ఇంప్రెస్ అవుతాడు. మీరు ఎప్పటికైనా బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవుతారని హర్ష అనగానే రేఖ కుళ్ళుకుంటుంది. ఇక మా బిజినెస్ కాంట్రాక్టులు అన్ని మీకే అని హర్ష చెప్పగానే ఇందు రాజు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత నా మాట లెక్క చెయ్యకుండా ఆఫీస్ కి వచ్చావని శృతిపై రేఖ కోప్పడుతుంది. నేను ఇందు మేడమ్ కి ద్రోహం చెయ్యలేనని శృతి చెప్తుంది. ఆ మాటలన్నీ ఇందు విని శృతి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. మరొకవైపు చలపతి, లక్ష్మీ ఇద్దరు చలపతి వర్క్ చేసే ఓనర్ ఇంటికి వెళ్తాడు. మా అమ్మాయి జాబ్ చేస్తుందని కంపెనీ పేరు చెప్తాడు. మా బాబు కూడా అందులోనే చేస్తున్నాడని చలపతి పేరు చెప్తాడు. అలాంటి వారు ఎవరు లేరని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత వెంకీ ఫుడ్ డెలివరీ కోసం చలపతి ఉన్న దగ్గరికి వస్తాడు. వాళ్ళు ఉన్నది గమనించి మాస్క్ పెట్టుకుంటాడు. త్వరగా ఫుడ్ ఇచ్చి రిటర్న్ అవుతాడు. మరొకవైపు మనం గెలిచాం అంటూ అందరికి శేషు స్వీట్ ఇస్తాడు. గెలిచింది మనం కాదు. ఆ ఇందు అని రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |